Nandigama | ప్రజాస్వామ్య పండుగలో భాగమైన ఎమ్మెల్యే

Nandigama | ప్రజాస్వామ్య పండుగలో భాగమైన ఎమ్మెల్యే

  • వీర్లపల్లిలో ఓటువేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగం

Nandigama | నందిగామ, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈరోజు ఉదయం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు. నందిగామ మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామంలో గల పోలింగ్ కేంద్రానికి ఆయన చేరుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే తమ గ్రామంలో ఓటు వేయడం పట్ల స్థానిక ఓటర్లు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply