Collector | సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలి

Collector | సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలి

  • జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Collector | నల్గొండ, ఆంధ్రప్రభ : పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం తిప్పర్తి మండల(Tipparti Mandal) కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించిన 18 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి గుర్తుగా చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రం(Polling station)లోకి ఎలాంటి పేపర్లు, వాటర్ బాటిల్ లాంటివి తీసుకువెళ్లకూడదని సూచించారు.

Leave a Reply