Gollapalli | నారీ శక్తికి ప్రతిరూపం..

Gollapalli | నారీ శక్తికి ప్రతిరూపం..

Gollapalli, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమ గాథలో మరో అధ్యాయనం రాసినట్టుగా.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన యువ నాయకురాలు గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కట్ట శరణ్య నామినేషన్ దాఖలు చేయడంతో గ్రామంలో కొత్త ఆశలు కొత్త ఉత్సాహం వెల్లివిరిశాయి. డిగ్రీ కళాశాలలో విద్యార్థి నాయకురాలిగా.. సామాజిక చైతన్యం పెంపొందించిన నిబద్దత గల నాయకురాలు అనిపించుకుంది.

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం వదిలిపెట్టి పూర్తిగా ప్రజా సేవకే అంకితం కావడం ఆమె సంకల్ప బలం ఎంతలా ఉందో చెబుతోంది. తెలంగాణ ఆడబిడ్డల పోరాట స్ఫూర్తి ఈ రెండు తనలో నిండుగా ఉన్న నారీ శక్తికి ప్రతిరూపమే కట్ట శరణ్య అని అంటున్నారు గ్రామస్థులు. ఆమె మద్దతుదారులు మాట్లాడుతూ.. విద్యార్థి నాయకత్వం సామాజిక సేవ అనుభవంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే యువ నాయకురాలు కట్ట శరణ్య. ఆమెను గెలిపించుకుంటామని అన్నారు.

Leave a Reply