Distributor | డిస్టిబ్యూటర్ కేంద్రాన్ని పరిశీల‌న‌…

Distributor | డిస్టిబ్యూటర్ కేంద్రాన్ని పరిశీల‌న‌…

Distributor | దండేపల్లి, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దండేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూటర్(Distributor) కేంద్రాన్ని ఈ రోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల ఎన్నికల సామాగ్రి పూర్తి స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎన్నికల విధులకు హాజరు కాని సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాజరైన సిబ్బందికి సమయపాలన పాటించి ఓటింగ్(voting) పూర్తి శాతం అయ్యేలా చూడాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. ఎన్నికల విధులకు హాజరు కాని సిబ్బంది పేర్లను ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Leave a Reply