Election Code | అక్రమ మద్యం పట్టివేత….

Election Code | అక్రమ మద్యం పట్టివేత….
Election Code | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కల్వకుంట గ్రామ శివారులో బుధవారం ఫ్లయింగ్ స్కాడ్(Flying squad) అధికారి రమ్యశ్రీ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్ పై ఇద్దరు వ్యక్తులు మద్యం కాటన్ బాక్సును తీసుకువెళ్తుండగా వారిని గమనించి పట్టుకుందామని వారు వెంబడించడంతో మార్గమధ్యంలో 48 క్వాటర్లు(48 quarters) ఉన్న బాక్స్ ను వదిలిపెట్టి పారిపోయారు.
అట్టి మద్యం కాటన్ స్థానిక పోలీస్ స్టేషన్(Police Station)లో పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఎలక్షన్ కోడ్(Election Code) నేపథ్యంలో అక్రమ మద్యాన్ని సరఫరా చేసినట్లయితే అట్టి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

