Counting Center | ఎన్నికల నియమావళిని ఉల్లంఘీస్తే కేసులు

Counting Center | ఎన్నికల నియమావళిని ఉల్లంఘీస్తే కేసులు

Counting Center | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని, ఎవరైనా అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీఐ సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు.

ఈ రోజు భీంగల్ మండల(Bheemgal Mandal) కేంద్రంలో గల ఫంక్షన్ హాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు మెంబెర్ స్థానాలకు పోటీ చేస్తున్న సభ్యులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల నియమవలిని ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. శాంతి భద్రతల(Law and Order)కు విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ పేర్కొన్నారు. మండలం లోని కొన్ని గ్రామాలను వివాదాస్పద గ్రామాలుగా గుర్తించి ముందస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఐదు ఏండ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల కొరకు గ్రామాల్లో శాంతి యుత వాతావరణం చెడగొట్టొద్దని సూచించారు. ఎన్నికలు వస్తాయ్, పోతాయ్ కాని గ్రామాల్లో శాశ్వతంగా ఉండేది మనమే అని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో(Elections) గెలిచేది ఒక్కరే అని గుర్తేరుగాలని తెలిపారు. ఎన్నికలను స్పోర్టివ్ గా తీసుకోవాలని హితవు పలికారు.

గ్రూప్ రాజకీయం చేసి అల్లర్లు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఒక్కసారి పోలీస్ రికార్డు(Police Record)ల్లో చేరితే భవిష్యత్తు లో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోవడం జరుగుతుందన్నారు. పోటీల్లో ఉన్న అభ్యర్థులు బైక్ ర్యాలీ, లౌడ్ స్పీకర్(Loud Speaker) ఏర్పాటు, సమావేశాల ఏర్పాటు కొరకు అధికారుల నుండి పర్మిషన్ పొందాలని చెప్పారు.

ఓటర్ల ను మద్యం, డబ్బులతో ప్రలోభాలకు గురి చేయవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా డబ్బులు, మద్యం తో ప్రలోభాలకు గురి చేసినట్టు తెలిస్తే పిర్యాదు చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాలు ఓటింగ్ జరిగే కంటే 44 గంటల ముందు ముగింపు చేయాలన్నారు.

ఎంపీడీఓ(MPDO) గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. క్రిమినల్ హిస్టరీ ఉన్న వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియామకం చేయొద్దని సూచించారు. ప్రతిరోజు జమ ఖర్చుల వివరాల గురించి అవగాహన కల్పించారు. 5వేల లోపు జనాభా ఉంటే లక్షా 50 వేలు, పైన ఉంటే రెండు లక్షల వరకు మాత్రమే ఎన్నికల ఖర్చు పెట్టాలన్నారు.

పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు అభ్యర్థులు ఉండాలని, పోలింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రం(Counting Center)లో అధికారులకు సహకరించాలని, ఎన్నికల అధికారులతో మర్యాదగా వ్యవహారించాలని సూచించారు. ఎన్నికల నియమవళి ఉల్లఘించి జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ సమావేశంలో తహసిల్దార్ షబ్బీర్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రామన్ కుమార్ ఎన్నికల్లో పాల్గొనే వివిధ గ్రామాల అభ్యర్థులు పాల్గొన్నారు.

Leave a Reply