Welfare schemes | ఆశీర్వదిస్తే.. సేవకుడిలా పని చేస్తా..

Welfare schemes | ఆశీర్వదిస్తే.. సేవకుడిలా పని చేస్తా..
- ఖానాపూర్ సర్పంచ్ అభ్యర్థి బూడిద మంగమ్మ సమ్మయ్య
Welfare schemes | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం ఖానాపూర్ గ్రామ సర్పంచ్ బరిలో బూడిద మంగమ్మ సమ్మయ్య బరిలో ఉన్నారు. గ్రామంలో ఏ నోటా విన్న బూడిద మంగమ్మ సమ్మయ్య గెలుపు మాట వినిపిస్తుంది. ఒక్కసారి అవకాశం కల్పించండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆమె ప్రచారం చేస్తున్నారు.
ఖానాపూర్ గ్రామాన్ని మంథని మండలంలోని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇస్తున్నారు. గ్రామంలోని నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు(Welfare schemes) అందించడంలో ముందు ఉంటారని ఆమె తెలుపుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు(new pensions) మంజూరు చేయించారు. నిరుపేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. మరోసారి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆమె కోరారు.
