water supply | ప్రజలందరికీ అందుబాటులో ఉంటా..

water supply | ప్రజలందరికీ అందుబాటులో ఉంటా..
- పోతారం సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల ఆదిత్య
water supply | మంథని, ఆంధ్రప్రభ : ప్రజాసేవకు అంకితమవుదామనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించాలని పోతారం సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల ఆదిత్య తెలిపారు. తనను గెలిపిస్తే ప్రజల సమస్యలు(People’s problems) తీరుస్తానని హామీ ఇచ్చారు.
తొలిసారిగా ఎన్నికల బరిలోకి నిలుస్తున్నానని, గ్రామస్తుల మద్దతు కూడగట్టుకొని నామినేషన్ వేసినట్లు తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య తీర్చడానికి కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామంలో ప్రత్యేకంగా బోర్లు వేయించి కుళాయిల ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా(water supply) చేయిస్తానన్నారు. అదేవిధంగా గ్రామానికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడానికి సైతం అంకితభావంతో కృషి చేస్తారని స్పష్టం చేశారు. సర్పంచిగా అవకాశం కల్పిస్తే గ్రామ సమగ్రాభివృద్ధికి చేస్తానని ఈ సందర్భంగా ఆదిత్య హామీ ఇచ్చారు.
