Bhaskar | సేవకునిగా పని చేస్తా..

Bhaskar | సేవకునిగా పని చేస్తా..

రాంపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పురం భాస్కర్

Bhaskar | నల్లబెల్లి, డిసెంబర్ 10(ఆంధ్రప్రభ) : స‌ర్పంచ్ ఎన్నికల్లో త‌న‌ను గెలిపిస్తే సేవకునిగా పనిచేస్తానని బీఆర్ఎస్ బ‌ల‌ప‌ర్చిన రాంపూర్ సర్పంచ్ అభ్యర్థి పురం భాస్కర్ అన్నారు. ఈ రోజు రాంపూర్ గ్రామంలో వార్డు మెంబర్లతో కలిసి ఆయ‌న ఇంటింటి ప్ర‌చారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే రాంపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతే తన ధ్యేయమని, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు కట్టెకోళ్ల సోమన్న, సీనియర్ నాయకుడు మల్యాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply