Brain Switch | మెదడులో అలవాట్లను మార్చే స్విచ్

Brain Switch | మెదడులో అలవాట్లను మార్చే స్విచ్

ఆంధ్రప్రభ : మెదడు గురించిన పరిశోధనల్లో జార్జిటౌన్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. ప్రపంచానికి తెలియని కొత్త విష యాన్ని(Something new) కనుగొన్నారు. అలవాట్లు వేగంగా ఏర్పడేందుకు కీలకమైన ఒక స్విచ్ను గుర్తించారు. మానసిక ఆరోగ్యం, చెడు వ్యసనాలు, మంచి అలవాట్లు ఏర్పడటంలో ఇది కీలకమని నిర్ధారించారు. కేసీసీ2(KCC2) అనే ప్రొటీన్ స్థాయిలను మార్చడం ద్వారా మెదడు నిర్ణయాలు, కార్యాచరణను నాటకీయంగా మార్చవచ్చని ఈ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూర్చిన ఈ అధ్యయనం తాజాగా నేచర్ కమ్యూనికేషన్స్(Nature Communications) ప్రచురించబడింది.
కేసీసీ 2 ప్రొటీన్ ను తగ్గినప్పుడు డోపమైన్ (న్యూరో ట్రాన్స్మీటర్) కార్యకలాపాలు పెరుగుతాయి. మంచి లేదా చెడుకు సంబంధించిన కొత్త అలవాట్లు(New habits) మరింత సులు భంగా ఏర్పడతాయి. సంకేతాలను రివార్డులతో అనుసం ధానించే మెదడు సామర్థ్యం నిర్దిష్ట ప్రోటీన్(specific protein) కార్యాచరణ స్థాయిని బట్టి మారవచ్చు అని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రయోజనకరమైన ఫలితాలకు దారితీసే సంకేతాలకు ఎప్పుడు ప్రతిస్పందించాలో, ధూమపాన వ్యసనం వంటి హానికరమైన ప్రవర్తనలను బలోపేతంచేసే సంకేతాలను ఎప్పుడు విస్మరించాలో నిర్ణయించడానికి ఈ ప్రక్రియ సహాయపడుతుందని జార్జిటౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లోని ఫార్మకాలజీ అండ్ ఫిజియాలజీ అసి స్టెంట్ ప్రొఫెసర్ అలెక్సీ ఓస్ట్రామోవ్ చెప్పారు.
