Silver Medal | చందుకు సిల్వ‌ర్ మెడ‌ల్

Silver Medal | చందుకు సిల్వ‌ర్ మెడ‌ల్

Silver Medal | వైరా, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా వైరాకి చెందిన ఫోటోగ్రాఫర్(Photographer) చందు, మొదటి నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ నిర్వహించిన తెలుగు ఆర్ట్ ఫోటోగ్రఫీ, వివిడీ ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో రెండు రోజులు జరిగిన ఫోటోగ్రఫీ వర్క్ షాప్ గాంధారి జీవన విధానం శైలి మీద మదర్ అండ్ చైల్డ్ ఛాయాచిత్రం తీసిన ఫోటోకు ప్రముఖ ఫోటోగ్రాఫర్ చందుకి జాతీయస్థాయి సిల్వర్ మెడల్(Silver Medal) సాధించాడు.

పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా సహ పలు రాష్ట్రాలకు చెందిన పలువురు ఫోటోగ్రాఫర్లు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన చందుని వైరా ఎస్సై పుష్పాల రామారావు, ట్రైనింగ్ ఎస్సై పవన్ కుమార్ శాలవతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎస్సై పుష్పాల రామారావు మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ రంగంలో జాతీయస్థాయిలో అవార్డులు(Awards) సొంతం చేసుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎస్సై తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ అభినందించారు. సన్మానించిన వారిలో ట్రైనింగ్ ఎస్సై పవన్ కుమార్, జర్నలిస్టులు వినోద్ కుమార్ నాగభూషణం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply