Pamphlets | ఇంటింటా విస్తృత ప్రచారం
Pamphlets | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం నాగారం గ్రామంలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎరుకొండ రమాదేవి శ్రీనివాస్ కు మద్దతు పెంచేందుకు ఈ రోజు బీఆర్ఎస్ పరకాల మండల అధ్యక్షులు, పరకాల మాజీ వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటింటికి వెళుతూ కరపత్రాలు(Pamphlets) పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడే బీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి ఏడుకొండ రమాదేవి శ్రీనివాసులు గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ గత ప్రభుత్వ(government) హాయంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

