programs | బీఆర్ఎస్ లో చేరికలు

programs | బీఆర్ఎస్ లో చేరికలు

  • మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సమక్షంలో చేరిన పలువురు నాయకులు

programs | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు, దామరగిద్ద మండలం విఠలాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు(Activists) ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… కొల్లంపల్లి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న సిద్ధి సాయమ్మవడేప్పకు, విఠలాపూర్ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న ఇ.నర్సప్పకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో(elections) వారిని భారీ మెజారిటీతో గెలిపించి ప్రజా ప్రతినిధులుగా నిలబెడతామని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో మైనార్టీ నాయకులు మహమ్మద్ అన్వర్, ఎండి.తకి, అలాగే జి.శ్రీను, బి.శ్రీను తదితరులు ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు (programs) తమను ఆకర్షించాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, దామరగిద్ద మండల అధ్యక్షులు సుభాష్, మాజీ ఎంపీపీ బక్క నర్సప్ప, మాజీ సర్పంచ్ పరశురామ్ రెడ్డి, హనమయ్య, కె.నరసింహ, తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply