Tributes | తెలంగాణను ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర

Tributes | తెలంగాణను ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర
- ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
Tributes | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : కేసీఆర్ ఆంధ్రోళ్లతో కొట్లాడి సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి వారి చేతుల్లో పెట్టే కుట్ర సాగుతుందని మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం భీంగల్ పట్టణంలో విజయ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
తెలంగాణను ఆంధ్రోళ్ల చేతుల్లో కుట్ర జరుగుతుందని ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ పాలనకు పాతర వేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమ సారథి కేసీఆర్ దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అని అన్నారు. కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాలేదని, కేసీఆర్ పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. సోనియా గాంధి తెలంగాణ స్టేట్ ఇవ్వలేదని, ముమ్మాటికీ కేసీఆర్ పోరాటం, అమరుల త్యాగం కారణంగా వచ్చిందన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చౌట్పల్లి రవి, దొనకంటి నర్సయ్య, ఆర్మూర్ మహేష్, భగత్, నర్సయ్య, ఇక్రమ్, లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
