Airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

Airport | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

  • మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్
  • ఇప్ప‌టి వ‌ర‌కూ 20 సార్లు బెదిరింపులు

Airport | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(International Airport) కు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఈ రోజు ఉదయం ఎయిర్‌పోర్టు అధికారులకు యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే విమానంలో బాంబు పెట్టామంటూ ఆగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది.

బాంబు తక్షణమే పేలకుండా ఉండాలంటే మిలియన్ డాలర్లు(million dollars) ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు పరిసరాలు, యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎయిర్‌పోర్టు అధికారులకు మెయిల్ పంపిన వ్యక్తి యూఎస్‌కు చెందిన జాస్పర్ గా నిర్ధారించారు.

తనిఖీల తర్వాత ఎలాంటి ప్ర‌మాదం లేదని సెక్యూరిటీ టీమ్ నిర్ధారించింది. ఈ ఒక్క ఏడాదే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 20కి పైగా బెదిరింపు కాల్స్, మెయిల్ వచ్చినట్లుగా శంషాబాద్ డీసీపీ రాజేశ్ వెల్లడించారు.

Leave a Reply