Competition | తంగళ్ళపల్లిలో రాజకీయ సునామీ
- కాంగ్రెస్ అభ్యర్థి మొర లక్ష్మీరాజం ప్రభంజనం
Competition | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : తంగళ్ళపల్లి గ్రామ రాజకీయ వాతావరణంలో పెద్ద మార్పు దిశగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మొర లక్ష్మీరాజ్యం ప్రచారం ఊపందుకుని అప్రతిహత వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుంటున్న ఆయనకు ముఖ్యంగా మహిళల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
ప్రతి వీధి, ప్రతి ఇంటా లక్ష్మీరాజ్యం పేరే వినిపిస్తూ గ్రామం మొత్తం ఎన్నికల వేడి రగులుతోంది. ప్రచారంలో గ్రామ మహిళలు(women), యువత, పెద్దలు స్వయంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. మహిళలు తమ సమస్యలను వివరించగా, వాటన్నింటికీ శ్రద్ధగా స్పందించి తక్షణ పరిష్కారం(solution)పై దృష్టి పెట్టే నాయకుడిగా లక్ష్మీరాజ్యం ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఆయన స్పష్టమైన హామీలు ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి.
లక్ష్మీరాజ్యం ఇచ్చిన కీలక హామీలు:
- శుభ్రమైన తాగునీటి సరఫరా
- గ్రామ రోడ్ల విస్తరణ, మరమ్మతులు
- మహిళా సంఘాల బలపరిచడం, స్వయం ఉపాధి ప్రోత్సాహం
- యువతకు ఉపాధి అవకాశాల పెంపు
- వెలుగు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధి
- నిజాయితీతో పనిచేసే నాయకుడిగా లక్ష్మీరాజ్యం గ్రామ ప్రజల్లో విశ్వాసాన్ని పొందుతున్నారు. ప్రచారం రోజురోజుకూ మరింత వేగం అందుకుంటుండగా, సర్పంచ్ పోటీ(Competition)లో ఆయన ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. తంగళ్ళపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్న అభ్యర్థిగా లక్ష్మీరాజ్యం ప్రజల హృదయాల్లో స్థానం సంపాదిస్తున్నారు.

