ADB | బైంసా ఎక్సైజ్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

  • పట్టుబడ్డ మహిళా ఎస్సై, కానిస్టేబుల్

నిర్మల్ ప్రతినిధి, బైంసా, (ఆంధ్రప్రభ) : బైంసా ఎక్సైజ్ సీఐ కార్యాలయంపై మంగళవారం రాత్రి ఏసీబీ దాడులు చేసింది. సుభాష్ గౌడ్ అనే వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా ఎక్సైజ్ ఎస్సై నిర్మలతో పాటు కానిస్టేబుల్ సుజాత ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

ఓ వ్యక్తి కళ్లు వ్యాపారానికి సంబంధించి ఎక్సైజ్‌ ఎస్‌ఎస్‌ నిర్మల, కానిస్టేబుల్‌ సుజాత లంచం డిమాండ్‌ చేసినట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు.. ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ క్ర‌మంలో వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్ సుజాత రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది.

కానిస్టేబుల్ సుజాత ద్వారా ఎస్సై నిర్మల లంచం తీసుకుంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కాగా, ఎస్సై నిర్మల‌తో పాటు కానిస్టేబుల్ సుజాతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎసిబి డిఎస్పీలు రమణమూర్తి, విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు కిరణ్ ఉన్నారు.

Leave a Reply