Solution | అన్ని సమస్యలు పరిష్కరిస్తా.. గెలిపించండి…

Solution | అన్ని సమస్యలు పరిష్కరిస్తా.. గెలిపించండి…
Solution | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం బీఆర్ ఎస్ పార్టీ బలపరిచిన గ్రామసర్పంచ్ అభ్యర్థి తూడి వెంకటేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ రోజు శ్రీమన్నారాయణ పురం గ్రామంలో ఇంటింటికి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈనెల 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తూడి వెంకటేష్ ను భారీ మెజారితో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా వాటి పరిష్కారం(Solution) కోసం కృషి చేస్తానన్నారు.
ఒక్కసారి అవకాశం ఇచ్చి తనను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎంపీపీ వై. కుమార్ గౌడ్, మండల కోఆర్డినేటర్ ముసిపట్ల విజయ్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
