In Charge | గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా

In Charge | గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా

తూడుకుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సత్తవరం విమల నర్సింహారెడ్డి
In Charge | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ :
నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తూడుకుర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సత్తవరం విమల నర్సింహారెడ్డి చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, గ్రామ సమస్యల పరిష్కారం కోసం తన భర్త సహకారంతో కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. తన భర్త నరసింహారెడ్డి సర్పంచ్ గా మండల పరిషత్ అధ్యక్షునిగా క్రియాశీలక రాజకీయాల్లో ఉండి దాదాపు 20సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఇన్చార్జి, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉన్నామని ఆమె తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. తన భర్త నర్సింహారెడ్డి హయాంలో రైతు వేదిక, సీసీ రోడ్లు కూరగాయల మార్కెట్, గ్రామ పంచాయతీ నిర్మాణం గోదాం నిర్మాణం, పనులు చేపట్టడం జరిగిందని జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్తి చేయడం జరిగిందని, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తన శక్తి మేరకు ప్రజలకు సేవలందించ‌డం జరిగిందని, ఇంకా భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తామని ఆమె తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా టీఆర్ఎస్ హయాంలో ప్రజలకు అందించడం జరిగిందని, గ్రామ అభివృద్ధిలో త‌మ కుటుంబం పాత్ర ఉందని, ఇప్పటికీ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజలు ఆదరిస్తున్నారని తమ గెలుపు కోసం కృషి చేస్తున్నామని విమల నర్సింహారెడ్డి తెలిపారు.

Leave a Reply