Development | ఇందిర రమేష్ ముమ్మర ప్రచారం
Development | పరకాల, ఆంధ్రప్రభ : తనను ఆదరిస్తే… పరకాల మండలంలోని మల్లక్కపేట్ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తానని గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థి దోమ్మటి ఇందిర రమేష్ తెలిపారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీని బలపరిచి మల్లక్కపేట్ గ్రామం అభివృద్ధికై తనను ఆశీర్వదించడం జరిగిందని, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(Challa Dharma Reddy) ఆశీస్సులతో గెలుపును కైవసం చేసుకుని మల్లక్కపేట్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
మల్లక్కపేట్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దొమ్మటి ఇందిర రమేష్ ను ఆదరిస్తే అభివృద్ధి(Development) చేసి చూపిస్తానని అన్నారు. అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మల్లక్కపేట్ మాజీ సర్పంచులు దుమల శ్రీనివాస్, బయ్య రాజేందర్, బిఆర్ఎస్ పరకాల మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వాడికారి మధుకర్, గ్రామ అధ్యక్షులు బొజ్జం రవి, ప్రధాన కార్యదర్శి దొమ్మటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

