CRIME | సర్పంచ్ అభ్యర్థి ఆత్యహత్య..

CRIME | సర్పంచ్ అభ్యర్థి ఆత్యహత్య..
CRIME | జోగిపేట, రాయికోడ్, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పిప్పడ్ పల్లి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజు (35) అదే మండల పరిధిలో ఉన్న శంషోదిన్ పూర్ గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శంషాద్దీన్ పూర్ గ్రామ శివారులో ఉన్న ఫామ్ హౌస్ వద్ద తోటి స్వాములతో సన్నిధానంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి రాజు అనే స్వామి రోజు మాదిరిగానే సోమవారం ఉదయం లేచి చెట్టుకు తువాలతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మృతుడు స్వామికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
