Party Office | అంబేద్కర్ గొప్ప దార్శనికుడు
Party Office | డోంగ్లి, ఆంధ్రప్రభ : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. ఈసందర్భంగా డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి మాట్లాడుతూ… దళితుల సాధికారత, పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.
స్వేచ్ఛ, సమానత్వం కోసం పరితపించారన్నారు. నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్, నాయకులు విజయ్ పాటిల్, శంకర్, బాలాజీ, నితిన్ పాటిల్, గజానంద్, ప్రవీణ్, మాధవ్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

