Roads | ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు..
Roads | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ నియోజకవర్గ పరిధిలో రూ.18 కోట్లతో ఆర్ అండ్ బీ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే (MLA) వెనిగండ్ల రాము తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లు కనుమరుగైతే.. కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో నియోజకవర్గంలోని గ్రామాల్లో 276 కొత్త రోడ్లు వేసామని గర్వంగా చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు – మోటూరు రహదారికి రూ.2 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులతో కలసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో (Media) మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎనర్జీఎస్, జిల్లా పరిషత్, సీఎస్ఆర్ నిధులు కోట్లాది రూపాయలతో పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఒక్క ఆర్ అండ్ బీ శాఖ ద్వారానే 11 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు పూర్తి చేయగా మరో ఏడు కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. ఇవి కాక నందివాడ, గుడివాడ రూరల్ మండలాల్లో మూడు కోట్ల రూపాయలు మంజూరు కానున్నట్లు ఆయన చెప్పారు.
నేడు శంకుస్థాపన చేసిన దొండపాడు రహదారి కనీసం నడిచేందుకు కూడా అవకాశం లేకుండా అధ్వానంగా ఉండేదని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెండు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నియోజకవర్గ వ్యాప్తంగా నూతన రహదారులు నిర్మాణం, అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మత్తులు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం (GOVT) చేస్తున్న కృషికి దాతలు ముందుకు వచ్చి సహకరించడం సంతోషకరమన్నారు. మండలంలోని గోల్వేపల్లి రహదారి అభివృద్ధికి సహకరించిన ఆక్వా రైతు రాజు, డోకిపర్రు రోడ్డు అభివృద్ధికి ముందుకు వచ్చిన మేఘ సంస్థకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. దాతల సహకారంతో జరిగిన అభివృద్ధి గుర్తింపును వారికే ఇస్తామన్నారు.
రాజకీయాలను పక్కనపెట్టి గుడివాడ (Gudivada) అభివృద్ధి కోసం అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉద్ధాటించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలందరికీ ఎంతో ఇబ్బందికరంగా ఉన్న రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టిన ఎమ్మెల్యే రాముకు దొండపాడు గ్రామ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ (Market) యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్రావు, పండ్రాజు సాంబయ్య, నిమ్మగడ్డ సత్యసాయి, ఆర్ అండ్ బి D.E జే కామేశ్వరరావు, ఎండిఓ విష్ణుం ప్రసాద్, డిప్యూటీ ఎండిఓ నరసింహరావు… దొండపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముక్తినేని అమరబాబు, డి.సి నూతక్కి కుటుంబరావు , పిఎసిఎస్ అధ్యక్షులు ముసునూరి రాజేంద్ర, నీటి సంఘం అధ్యక్షులు వీర బసవయ్య, సర్పంచ్ గుడివాడ శ్రీను, గ్రామ టీడీపీ నాయకులు చోరగుడి బుజ్జి, తుమ్మల రత్నాకరరావు, లింగమనేని ప్రసాద్, మార్కెట్ యార్డు లింగం శివరావు, నక్కా పండు, బలరాం, గుత్తా వెంకటేశ్వరరావు, గుత్తా శ్రీనివాసరావు, నిమ్మగడ్డ ప్రకాశరావు, తమ్మారెడ్డి వెంకటేశ్వర రావు, జనసేన గ్రామ అధ్యక్షుడు బాబూజీ, మల్లాయి పాలెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఉంగరాల మురళి, డిఎన్ రవి దొండపాడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

