- శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో మంటలు
హైదరాబాద్: సోమాజిగూడలోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెస్టారెంట్ కిచెన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వెలువడడంతో భవనంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఐదో అంతస్తులో రెస్టారెంట్, నాలుగో అంతస్తులో జీఆర్‌టిని జ్యువెలర్స్ ఉండటం వల్ల పొగలు పై అంతస్తులలో వేగంగా వ్యాపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, అగ్నిమాపక సిబ్బంది శీఘ్రం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
భవనంలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించి, మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. సరైన సమయంలో కస్టమర్లను ఖాళీ చేయించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

