Development | బాలయ్యపల్లి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక….
Development | రేగొండ, ఆంధ్రప్రభ : మండలంలోని బాలయ్య పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ(Congress party) సర్పంచ్ అభ్యర్తిగా తోట్ల తిరుపతిని గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తూ గ్రామ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రజల కష్టసుఖాల్లో పలుపంచుకుంటూ అభివృద్ధికి(Development) గ్రామ ప్రజలకు చోదోడు వాదొడుగా తోడుంటానని వారు అన్నారు.
గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ గ్రామ అభివృద్ధిలో తన వంతు సహాయo అందజేస్తు ఉంటానని వారు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పరిధిలో ఉండే ప్రతి వార్డ్ సమస్యను తన సమస్యగా నిలబడి ఉంటూ ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తానని వారు అన్నారు.

