RDO Office | భూ భారతి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి

RDO Office | భూ భారతి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి

RDO Office | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ రోజు చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం(Office of the RDO)లో పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా డిస్పోస్(Dispos) చేయాలన్నారు. పాత రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే, అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు.

చిన్నచిన్న కారణాల వల్ల దరఖాస్తులను(Applications) తిరస్కరించకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలన జరిపి అర్హులుగా నిర్ధారణ అయిన వారి దరఖాస్తులను ఆమోదించాలన్నారు. ఈ కార్యక్రమం ఆర్డీవో వి శేఖర్ రెడ్డి, తహసిల్దార్ వీరాబాయి, డిప్యూటీ తహసిల్దార్ సిద్ధార్థ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply