Collectorate | తొలి దశ ర్యాండమైజేషన్ పూర్తి
- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో
- పకడ్బందీగా సాగిన ర్యాండమైజేషన్ ప్రక్రియ
Collectorate | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు తొలి దశ ర్యాండమైజేషన్ (Randomization) మండలాల వారీగా నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.
ర్యాండమైజేషన్ ప్రక్రియ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాల్లో ఎన్నికల (Election) విధులు నిర్వహించేందుకు సరిపడినంత మంది పీఓ, ఓపీఓ లను నియమించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 20శాతం అదనంగా అధికారులను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. దీనిద్వారా ఎన్నికల నిర్వహణలో అధికారుల కొరత తలెత్తకుండా ఉంటుందన్నారు. ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, డీఈఓ భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

