Tulsi Ram | రెండోసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..
Tulsi Ram | కేరమేరి, ఆంధ్రప్రభ : రెండవసారి తమకు అవకాశం ఇస్తే ప్రజాసేవకు అంకితమవుతామనే ఉద్దేశంతో స్థానిక ఎన్నికల్లో (Election) రెండోసారి పోటీ చేస్తున్నానని సర్పంచ్ అభ్యర్థి కావుడే తులసి రామ్ అన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా మీ ముంగిటకు వస్తున్నాను.. వచ్చే ఎన్నికల్లో తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే… ప్రజల కష్టాలను తీరుస్తానని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలం సావర్కేడ గ్రామానికి చెందిన కావుడే తులసీరామ్ అన్నారు.
గత ఐదు సంవత్సరాలు తమకు గ్రామ ప్రజలు అవకాశమిస్తే అనేక సంక్షేమ అభివృద్ధి పనులను చేపట్టానని, రెండోసారి అవకాశం ఇస్తే గ్రామంలోని అన్ని మౌలిక వసతులు కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన ఆంధ్రప్రభతో తెలిపారు. నామినేషన్ (Nomination) పరిశీలన, ఉపసంహరణ అనంతరం కావుడే తులసి రామ్ కు అధికారులు కత్తెర గుర్తు కేటాయించారు. ఆ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నారు.

