Vehicle | సుగుణక్క వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Vehicle | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు(Random checks) ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో అధికారులు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. శుక్రవారం ఉట్నూర్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క(aathram Sugunakka) వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.

ఉట్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఆమెను ఆపిన పోలీసులు వాహనంతో పాటు, ఆమె పర్సును కూడా వదలకుండా చెక్ చేశారు. ఈ క్రమంలో సుగుణక్క తన వాహనం దిగి పోలీసుల(police) తనిఖీకి పూర్తిగా సహకరించారు. సుగుణక్క వాహనంతో పాటు ఆమె వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం సుగుణక్క అక్కడి నుంచి ఆసిఫాబాద్(Asifabad) నియోజకవర్గం పర్యటనకు వెళ్లారు.

Leave a Reply