parking lot | సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు ప‌రిశీల‌న‌…

parking lot | సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు ప‌రిశీల‌న‌…

parking lot | నర్సంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) శుక్రవారం నర్సంపేట పర్యటన సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పోలీస్, రెవెన్యూ అధికారులతో ముఖ్య మంత్రి పర్యటించే ప్రదేశాలను సందర్శించి పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో సమీక్షా జరిపారు.

సిపి ఈ రోజు సాయంత్రం సభాస్థలవేదిక, హెలిప్యాడ్(Helipad), పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి ముఖ్య మంత్రి భద్రతకై తీసుకోవాల్సిన చర్యలపై సీపీ అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని స్పష్టం చేశారు. మహబూబాబాద్ రోడ్డు లోని సర్వాపురం స్మశాన వాటిక సమీపంలో వాహనాల పార్కింగ్ స్థలాన్ని(parking lot) ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు అధికారులు ప్రకటించారు ఉదయం నుండి నర్సంపేట ఎస్సై రవికుమార్ వాహనాలు నిలిపి స్థలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎత్తుపల్లాలను సదును చేశారు.

Leave a Reply