Heavy Rain | ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు
- రాకపోకలకు అంతరాయం
Heavy Rain | పొదలకూరు, (నెల్లూరు), ఆంధ్రప్రభ : పొదలకూరు మండలంలో దిత్వా తుఫాన్ ప్రభావంతో గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం(People’s life) అస్తవ్యస్తంగా మారింది. పలు గ్రామాలకు వెళ్లే దారుల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముదిగేడు – ఇనుకుర్తి గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముదిగేడు నుంచి రాపూరు- పొదలకూరు మెయిన్ రోడ్డుకు వచ్చేందుకు రాకపోకలు(Arrivals) నిలిచిపోయాయి. దీంతో ఆ గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పొదలకూరు, మర్రిపల్లి, ఇనుకుర్తి గ్రామాలల్లోని వర్షపు నీరంతా ముదిగేడు వాగు(Mudigedu vaagu) వైపు ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి పైన నాలుగు అడుగులు నీళ్లు ప్రవహిస్తున్నాయి. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారిని ట్రాక్టర్ ద్వారా వాగు దాటిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్ల క్రితం ఇక్కడ వంతెన(the bridge) నిర్మించారని పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ వంతెనపై నాలుగైదు అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయన్నారు. దీంతో వాగు దాటలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంబంధిత అధికారులు తమ చర్యలు చేపట్టి ఈ వాగు పై హై లెవెల్ వంటి నిర్మించాలని కోరుతున్నారు.

