Panchayat elections | ఎన్నికల్లో సత్తా చాటాలి

  • రాబోయేది గులాబీ రాజ్యమే
  • మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

Panchayat elections | క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్(Balka Suman) పిలుపునిచ్చారు. గురువారం తన నివాసంలో గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ప్రజలు విసుగు చెందారని, గ్రామాల్లో తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా ఉందన్నారు.

గతంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రాబోయే కాలంలో అందుబాటులో ఉండి సేవలందిస్తామని ప్రజలకు తెలియజేసి పంచాయతీ ఎన్నికల్లో(Panchayat elections) విజయం సాధించాలన్నారు.

రాబోయేది గులాబీ రాజ్యమేనని, కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ అధైర్యపడవద్దని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఎన్నికల్లో పోరాడాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply