Rs.600 crore | ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు

Rs.600 crore | ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు

  • సీఎంతో రూ.600 కోట్లకు శంకుస్థాపన
  • ఎన్నికల కోడ్ పోతే మరో రూ.650కోట్లకు శంకుస్థాపన

Rs.600 crore | నర్సంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలోని ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. నర్సంపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించే సీఎం సభా స్థలాన్ని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యంలోనే అభివృద్ధి పథంలో నర్సంపేటను ముందుకు తీసుకెళ్ల‌డం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట పట్టణంలో రూ.600 కోట్ల(Rs.600 crore)తో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్(election code) అయిపోయిన తర్వాత మరో రూ.650కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని వివరించారు.

ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి వెనుకబడి ఉన్న నర్సంపేట నియోజకవర్గాన్ని క‌నీవినీ ఎరుగని రీతిలో చక్కదిద్దడం జరుగుతుందన్నారు. అభివృద్ధి చేసి ప్రజలకు కనువిప్పు కలిగే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందని మాధవరెడ్డి స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి సభకు 40వేల మంది ప్రజలు హాజరవుతారని నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా నర్సంపేట పట్టణంలో జరిగే సభకు హాజరవుతున్నారు. దీంతో సభా స్థలంలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తగా చూస్తున్నామని ఆయన వివరించారు. సభా స్థలం అంతా ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్ల(flexi, banners)తో నిండిపోయింది.

సీఎం రేవంత్ రెడ్డి సభ పోలీస్ నిఘా నీడలో నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు. సీఎం సభ బందోబస్తు కోసం సుమారు వెయ్యి మంది పోలీసులు హాజరుకానున్నట్లు తెలిసింది. ఈస్ట్ జోన్(East Zone) డీసీపీ పరిధిలోని సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది భారీ స్థాయిలో హాజరయ్యే పరిస్థితులున్నాయి.

నర్సంపేటకు మొట్ట మొదటిసారిగా సీఎం వస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే.. అందువల్ల భారీ బందోబస్తు(heavy security) ఏర్పాటు చేయనున్న‌ట్లు అధికారుల ద్వారా తెలిసింది. సభకు భారీగా వాహనాలలో ప్రజలను తరలించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండెం రామానంద్, పాలయి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply