200 aircraft | 300 ఇండిగో విమానాల రద్దు
200 aircraft | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : దేశంలో విమానాయానంలో సేవలు అందజేస్తున్న ఇండిగో పలు కారణాలతో సర్వీసులను రద్దు చేయడంతో వేలాది మంది విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన 300కి పైగా(Over 300) విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేసింది.
శంషాబాద్లో 35 విమానాల రద్దు..
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్న సంగతి విదితమే. సిబ్బంది కొరత , సాంకేతిక సమస్యలతో వరుసగా రెండో రోజూ సంస్థకు చెందిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ఇతర పట్టణాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. నిన్న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 19 విమానాలు, వివిధ విమానాశ్రయాల నుంచి ఆర్‌జీఐ(RGI)కి రావాల్సిన 21 విమానాలు రద్దయిన విషయం తెలిసిందే.
ఈ రోజు కూడా శంషాబాద్ నుంచి బయల్దేరాల్సిన 33 విమానాలను అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్‌కు రావాల్సిన మరో 35 విమానాలు కూడా రద్దయ్యాయి. ఇండిగో ప్రతిరోజూ 2200 విమానాలను(200 aircraft) నడుపుతున్నది. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

