Cotton | పత్తికి నిప్పు పెట్టింది ఎవరు..?

Cotton | పత్తికి నిప్పు పెట్టింది ఎవరు..?
Cotton, రాయపోల్, ఆంధ్రప్రభ : ఇంటి వద్ద నిల్వ ఉన్న పత్తికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన సంఘటన మండల కేంద్రం రాయపోల్ లో బుదవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయపోల్ గ్రామానికి చెందిన కొంగరి స్వామి ఇంటి ముందు భాగంలో నిల్వ ఉంచిన సుమారు 40 క్వింటాళ్ల పత్తి పై రాత్రి 10.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో నిప్పు వేగంగా వ్యాపించింది. పొలం నుంచి తిరిగి వచ్చిన స్వామి పత్తిలో నుండి పొగలు ఎగసిపడటం గమనించి అరవడంతో ఇరుగు, పొరుగు వారు చేరుకొని మంటలను అదుపుచేశారు. సుమారు 20 క్వింటాళ్ల పత్తి పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు స్వామి తెలిపాడు. ఈ ఘటన పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాత్రి సమయం లో పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు.
