శ్రీశైలం మల్లన్న సన్నిధిలో టీమిండియా క్రికెటర్లు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : టీమిండియా క్రికెటర్లు బుధవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవస్థానం ఏపీఆర్ఓ డాక్టర్ శివారెడ్డి తెలిపిన వివరాల మేరకు బుధవారం టీమిండియా క్రికెటర్ లేనా జితేష్ శర్మ,రవి బిష్ణాయ్, లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
దేవాలయం ఎంత కలియతిరిగారు. ఆలయ రాజగోప్రముద్దకు చేరుకున్న క్రికెటర్లకు అధికారులు ఆర్థిక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరికి పేద పండితులు ప్రత్యేక పూజలు వేద ఆశీర్వ వచనాలు అందజేశారు.
దేవాలయం శిల్పకలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలంను దర్శించుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని క్రికెటర్లు తెలిపారు. క్రికెటర్లకు శేష వస్త్రాలను గట్టు ప్రసాదాలను వారికి అందజేశారు వారికి దేవస్థానం అధికారి శివారెడ్డి ఇక్కడ జరిగినటువంటి ఆశ్చర్యకర సంఘటనలను వారికి వివరించారు. శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూడా తిలకించారు. అనంతరం వారికి ఆశీర్వచనం అందజేశా రు…
