CC Cameras | పోలీస్ స్టేష‌న్స్‌ను సంద‌ర్శ‌న‌…

CC Cameras | పోలీస్ స్టేష‌న్స్‌ను సంద‌ర్శ‌న‌…

CC Cameras | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్(Dr. Sangram Singh G. Patil) ఈ రోజు సాయంత్రం కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు పోలీస్ స్టేషన్స్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్స్(Police Stations) పరిధిలో ఉన్న గ్రామాలలో ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది, నామినేషన్ క్లస్టర్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.

రౌడీ షీటర్ల వివరాలను తెలుసుకుని, వారి కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న విలేజ్ పోలీస్ ఆఫీసర్స్(Village Police Officers) తమ తమ గ్రామాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు.

నేర నిరోధక చర్యల్లో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల(CC Cameras) ఏర్పాటుకు చురుకుగా ముందుకు రావాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల సందర్శన సమయంలో స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Leave a Reply