వ్యాయామ ఉపాధ్యాయుడికి ఉత్తమ పురస్కారం..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు ఏకు నరేష్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. హనుమకొండ లోని రాంనగర్ లో గల వేదాంతు లర్నింగ్ సెంటర్ లో, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సభలో, పరకాల పట్టణానికి చెందిన ఏకు నరేష్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2025 అందుకున్నారు.

హనుమకొండలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ, సభాధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు చంద్రగిరి సునీల్ కుమార్, మాస్టర్ జి విద్యాసంస్థల చైర్మన్, ఎక్స్ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, రామప్ప జూనియర్ కాలేజ్ డైరెక్టర్ ఐలి కర్ణాకర్ గౌడ్, వేదాంతు లర్నింగ్ సెంటర్ మేనేజర్ సోమేశ్వర్ రావుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు సునిల్ కుమార్ మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా విద్యారంగంలో పీఈటీ పాత్ర పోషిస్తూ, ఎంతోమంది విద్యార్థులను క్రీడారంగంలో ప్రోత్సహిస్తూ, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో రాణింపజేస్తూ, కేవలం పరకాలలోనే కాకుండా, జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తున్నందుకు ఏకు నరేష్ ను గుర్తించి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ పురస్కార అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. అవార్డు గ్రహీత ఏకు నరేష్ మాట్లాడుతూ… తనను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply