ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానం చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి గంగా మాత ఆశీస్సులు పొందడానికి వచ్చినట్లు తెలిపారు. గంగా మాత ఆశీస్సులు అందరిపై కురిపించాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఇటీవలే కొత్త భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ఎన్నికయ్యారు.ఆయన ఆధ్వర్యంలో ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Mahakumbamela | త్రివేణి సంగంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పుణ్యస్నానం
