Election Campaign | కాంగ్రెస్​ను ఓడించేందుకు బీఆర్​ఎస్​, బీజేపీ కుట్రలు – రేవంత్ రెడ్డి

నిజామాబాద్ , ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌క‌నుగుణంగా పాల‌న సాగుతోంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం నిజామాబాద్ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ లు కుట్రలు చేస్తున్నాయ‌ని ఆరోపించారు. మాజీ సీఎం కేజీఆర్ చేసిన అప్ప‌లకు వడ్డీ లు కడుతున్నామ‌ని, ఇందు కోసం కొత్త అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌ని , కాంగ్రెస్ వ‌చ్చాక ప్ర‌తి నెలా మొద‌టి తేదీ నాటికి జీతాలు చెల్లిస్తున్నామ‌ని చెప్పారు.

బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారు
అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌ను తిర‌స్క‌రించార‌ని, ఫామ్‌హౌజ్‌లో పడుకోవాలని కేసీఆర్ కు ప్రజలు సెలవి చ్చార‌ని రేవంత్ గుర్తు చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా వ‌చ్చాయ‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేయని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పట్ట భద్రులు, ఉద్యోగ నేతలే ముందున్నారని గుర్తు చేశారు.

అందుకే ఓట్లు అడుగుతున్నాం…
నిరుద్యోగులు పదేళ్లు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగార‌ని, త‌మ ప్ర‌భుత్వం 55 వేల ఉద్యోగాలు ఇచ్చింద‌ని రేవంత్ రెడ్డి అన్నారు. టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామ‌న్నారు. ప్రపంచంతో పోటీ పడేందుకే యంగ్ ఇండియా యూనివర్సిటీ
నిరుద్యోగుల గౌరవం పెంచేలా చర్యలు తీసుకుంటుంద‌న్నారు. రైతు రుణ‌ మాఫీ, రైతు బోనస్ ఇవ్వ‌డం నిజం కాదా? అని అన్నారు. ఈ అన్ని నిజాలు కాబ‌ట్టే తాము ఓట్లు అడుగుతున్నామ‌న్నారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరారు.

కుల‌గ‌ణ‌న ఎందుకు చేయ‌లేదో బండి సంజ‌య్ చెప్పాలి
కులగణన ఎందుకు చేయలేదో బీజేపీ నేత‌, కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాల‌ని రేవంత్ అన్నారు. బీజేపీ నేతలు లెక్కలు త‌ప్పు అని, బీసీల పొట్టగొడుతున్నార‌న్నారు. ఎక్కడ తప్పులు ఉన్నాయో చూపించాల‌న్నారు. ఏవో మాటలతో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని చెప్పారు. సమగ్ర సర్వే లో కేసీఆర్ తేల్చింది బీసీలు 51 శాతమ‌ని, తాము తేల్చింది తేల్చింది 56 శాత‌మ‌ని అన్నారు. రాజ్యాంగ పరంగా మైనారిటీ లు బీసీ రిజర్వేషన్ లకు అర్హులన్నారు. బీజేపీ పాలిట బీజేపీ పాలిత గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లో ముస్లిం మైనారిటీ లు రిజర్వేషన్లు ఇవ్వడం నిజం కాదా అని ప్ర‌శ్నించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంద‌న్నారు. గొర్రెల స్కామ్, ఈ కార్ రేస్ కేసులో ఎందుకు అరెస్టులు చేయడం లేద‌న్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు ను తెస్తే సంబంధం ఉన్న వాళ్ళందరిని 24 గంటల్లో జైల్లో వేస్తా అని బీజేపీ చెప్పింద‌ని గుర్తు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఎవ‌రికో బీఆర్ఎస్ చెప్పాలి?
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయ‌ని సీఎం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ మద్దతు ఎవరికో చెప్పాల‌ని నిల‌దీశారు. బీఆర్ఎస్ అవినీతికి బీజేపీ నేతలు అండగా నిలుస్తున్నారన్నారు. మెట్రో, మూసి,రీజినల్ రింగ్ రోడ్డు లను అడ్డుకున్నది కిషన్ రెడ్డి కాదా? కేంద్రం అనుమతులు ఇప్పించని దద్దమ్మ కిషన్ రెడ్డి అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *