Brutal | సెక్యూరిటీ గార్డు దారుణ హత్య

Brutal | సెక్యూరిటీ గార్డు దారుణ హత్య
Brutal | నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ (Security guard) ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నంద్యాల టూ టౌన్ సీఐ అస్రార్ భాష వివరాల మేరకు సోమవారం అర్ధరాత్రి విధుల్లోని సెక్యూరిటీ గార్డు పెద్దన్నను బంధువులే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తన అన్నా వదిన గొడవ పడుతుండగా అడ్డుగా వెళ్లిన పెద్దన్న ను కత్తితో దాడి చేశారు. హుటాహుటిన నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పుడే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అతని స్నేహితుడు ఉప్పరి పేటకు చెందిన సురేష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
