Minister | ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ…

Minister | ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ…
- పరిశ్రమలు, ఉపాధికి దిక్సూచి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్!
జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
Minister | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రెండేళ్లలో అద్భుత ప్రజాపాలన అందించామని రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణ బాటలో భాగంగా ఈ నెల 4న ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను మంత్రి జూపల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రానున్న మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయం సాధించడం ఖాయమన్నారు. మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు రానున్న ఎన్నికలకు రెఫరెండం అని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో సాధించిన విజయాలను ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకే ముఖ్యమంత్రి అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు.
- పరిశ్రమలు, ఉపాధికి దిక్సూచి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను హైదరాబాద్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ సమ్మిట్ లో వ్యవసాయం, పరిశ్రమలు, మహిళల (Women) సాధికారిత, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు అంశాలపై చర్చలు జరిపి, ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తామని చెప్పారు. - ప్రజా పాలనకు రెఫరండం జూబ్లీహిల్స్ ఎన్నిక..
మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రజా ప్రభుత్వ పాలనకు రెఫరెండం అని మంత్రి చెప్పారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎన్ని కుట్రలు పన్నినా, అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే మున్సిపాలిటీ, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని స్పష్టం చేశారు. ఈనెల 4న ముఖ్యమంత్రి అదిలాబాద్ పట్టణ పర్యటన సందర్భంగా రూ. 50 కోట్లపైనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. తాము చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి భరోసా కల్పిస్తామని మంత్రి తెలిపారు. మంత్రి జూపల్లి వెంట డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి , సోయం బాపూరావు, వేణుగోపాల చారి, గణేష్ రెడ్డి, ఆడే గజేందర్ , సాజిద్ ఖాన్, సుజాత, శ్రీకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
