Kodur | బీసీ సంఘాల ఆధ్వర్యంలో..

Kodur | బీసీ సంఘాల ఆధ్వర్యంలో..
Kodur | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు ప్రధాన సెంటర్లో మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు(Venkata Krishna Rao) విగ్రహానికి బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్రహం మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మేమందరం కృష్ణారావు అడుగుజాడల్లో నడిచాం.
ఇప్పుడు ఆయన తనయుడు మండలి బుద్ధప్రసాద్, మనవడు వెంకట్రామ్‌తో కలిసి నడుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముద్దినేని చందర్రావు(Muddineni Chandra Rao), కోడూరు నీటి సంఘాల వైస్ ప్రెసిడెంట్ బచ్చు పూర్ణచంద్రరావు, బడే బావన్నారాయణ, కోడూరు లైన్స్ క్లబ్ చైర్మన్ పోతబోయిన సీతారత్న సాయిబాబు, మాజీ డిసి వైస్ ప్రెసిడెంట్ కాగిత రామారావు, కడవకొల్లు శ్రీనివాసరావు, పరిసే వెంకటేశ్వరావు, పెద్ది బాబురావు, బచ్చు వెంకటేష్, జరుగు కిరణ్ బాబు, అప్పికట్ల రాంబాబు, మల్ల వెంకటేశ్వరరావు, ఉల్లి వెంకటేశ్వరరావు, బడే కృష్ణ, విశాంశెట్టి సాయిబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
