Samantha-Raj Nidumoru| భూత శుద్ధి వివాహం

Samantha-Raj Nidumoru| భూత శుద్ధి వివాహం
Samantha-Raj Nidumoru| సమంత.. పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది. తెలుగు తెరకు ఏమాయ చేసావే అంటూ ఏ ముహుర్తాన పరిచయం అయ్యిందో కానీ.. టైటిల్ (Title) కి తగ్గట్టుగానే ప్రేక్షకులను మాయ చేసింది. తన అందం, అభినయంతో మెప్పించి.. అనతి కాలంలోనే అగ్ర తార అయ్యింది. స్టార్ హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుని ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఏ పాత్ర చేసినా.. ఆ పాత్రలో అంతకంటే గొప్పగా ఇంకెవరూ చేయలేరేమో అనేంతగా నటించడం సామ్ స్టైల్.
గత కొన్ని రోజులుగా సమంత, రాజ్ నిడిమోరు (Samantha, Raj Nidimoru) లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ చేసినప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారిందని గుసగుసలు వినిపించాయి. ఈమధ్య సమంత ఎక్కడ ఉంటే.. రాజ్ అక్కడే ఉండేవారు. ఇంకా చెప్పాలంటే.. ఎక్కడికి వెళ్లినా.. ఇద్దరూ జంటగా వెళ్లేవరు. దీంతో వీరిద్దరి గురించి ప్రచారంలో ఉన్న వార్తలు నిజమే అనిపించింది. ఈ ఇద్దరి గురించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోయేది. అనుకున్నట్టుగానే సామ్, రాజ్ పెళ్లి చేసుకున్నారు. అయితే.. భూత శుద్ధి వివాహం చేసుకున్నారని తెలిసంది.

Samantha-Raj Nidumoru |ఇంతకీ.. భూత శుద్ద వివాహం అంటే ఏంటి…?
కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి (Linga Bhairavi) సన్నిధిలో, పవిత్రమైన భూత శుద్ధి వివాహం చేసుకున్నారు సమంత, రాజ్ నిడిమోరు.
ప్రముఖ నటి సమంత, నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో, పవిత్రమైన భూత శుద్ధి వివాహం (Marriage) ద్వారా ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఈ భూత శుద్ధి వివాహం.
లింగ భైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు, వధూవరుల (Bride and groom) దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సమంత, రాజ్ జంటకు ఈశా ఫౌండేషన్ హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపింది. దేవి అపారమైన అనుగ్రహంతో వీరి జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించింది.
Samantha-Raj Nidumoru | లింగ భైరవి గురించి..
సద్గురు చేతుల మీదుగా ఈశా యోగ కేంద్రంలో ‘ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన లింగ భైరవి దేవి, స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్టమైన ఆచారాలకు ఈ ఆలయం నెలవు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఎనిమిది అడుగుల శక్తి (Energy) స్వరూపం – భక్తుల మనశ్శరీరాలను, శక్తులను స్థిరపరుస్తూ, జననం నుండి మరణం వరకు జీవితంలోని ప్రతి దశలోనూ వారికి అండగా నిలుస్తుంది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల శుభం సినిమాతో నిర్మాతగా మారి సక్సెస్ సాధించింది. ఇప్పుడు నందినీ రెడ్డి (Nandini Reddy) డైరెక్షన్లో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాకి మా ఇంటి బంగారం అనే టైటిల్ ఖరారు చేశారు. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంది. పెళ్లి తర్వాత నటిగా, నిర్మాతగా సామ్ మరింత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తుందని సమాచారం.
