Tej 2026 |మరో క్రేజీ మూవీకి తేజ్ గ్రీన్ సిగ్నల్..

Tej 2026 |మరో క్రేజీ మూవీకి తేజ్ గ్రీన్ సిగ్నల్..

Tej 2026 | వెబ్ డెస్క్ ఆంధ్రప్రభ : మెగాస్టార్ మేనల్లుడు, సాయి దుర్గ తేజ్.. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు అయినప్పటికీ.. కథపై ఉన్న నమ్మకంతో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ సినిమాగా నిర్మిస్తున్నారు. ఈపాటికే సంబరాల ఏటిగట్టు రిలీజ్ కావాల్సింది కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. ఇది రిలీజ్ అవకుండానే తాజాగా తేజ్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ.. మరి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సంబరాల ఏటిగట్టు ఏమైంది..? లేటెస్ట్ గా తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరికి..?ఏ నిర్మాణ సంస్థ సారధ్యంలో ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనుంది? ఏ దర్శకుడి చేతిలో తెరకెక్కనుంది? అని సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Tej 2026

Tej 2026 | మెగాస్టార్, పవర్ స్టార్ లకు తగ్గ మేనల్లుడు

అప్పట్లో తేజ్ కెరీర్ స్టార్టింగ్ లోనే.. పిల్లా నువ్వు లేని జీవితం, రేయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్.. ఇలా వరుసగా సక్సెస్ సాధించి యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే.. మెగాస్టార్, పవర్ స్టార్ లకు తగ్గ మేనల్లుడు అని అభిమానులచేత అనిపించుకున్నాడు. అయితే.. వరుసగా విజయాలు సాధించి, అభిమానులను అలరించిన తేజ్.. ఆ తర్వాత చిత్రాలకు మాత్రం సరైన కథలు ఎంచుకోవడంలో తడబడ్డాడు. తిక్క, విన్నర్, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు అంటూ చేసిన ప్రయత్నాలు సరైన ఫలితాలు అందివ్వలేదు. దీంతో కెరీర్ లో వెనకబడ్డాడు. అభిమానులను నిరాశపర్చాడు.

తేజ్ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో చాలా కథలు విని ‘చిత్రలహరి’ అనే సినిమా చేశాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందిన చిత్రలహరి సినిమా, తేజ్ కు మంచి విజయాన్ని అందించింది. ఇక ఆతర్వాత సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, విరూపాక్ష, బ్రో సినిమాలు సక్సెస్ అందించాయి. అయితే.. రిపబ్లిక్ సినిమా టైమ్ లో బైక్ యాక్సిడెంట్ అయి, కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.. అయితే.. విరూపాక్ష, బ్రో చిత్రాలతో సూపర్ హిట్ సాధించినా స్పీడు పెంచలేదు తేఝ్. కాస్త విరామం ఇచ్చినా, సరైన కథతో సినిమా చేయాలని చాన్నాళ్లు వెయిట్ చేశాడు. ఆఖరికి నూతన దర్శకుడు రోహిత్ చెప్పిన సంబరాల ఏటిగట్టు అనే కథ నచ్చడంతో ఓకే చెప్పాడు.

Tej 2026 |ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు

సంబరాల ఏటిగట్టు ఈ సినిమాని హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆ మధ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అప్పటి వరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచేసిందని చెప్పచ్చు. అయితే.. ఈ సినిమాని 25 సెప్టెంబర్ 2025 న రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు కానీ.. అదే డేట్ కి పవర్ స్టార్ ఓజీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వడంతో సంబరాల ఏటిగట్టు వాయిదా పడింది. ఇంతవరకు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం.. రాబోయే కొత్త సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది అప్ డేట్ ఇవ్వనున్నారని తెలిసింది.

Tej 2026 | డిఫరెంట్ గా ఉన్న ఈ కథకు తేజ్ ఒకే

ఇటీవల తేజ్.. రిపబ్లిక్ మూవీ సీక్వెల్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాని దేవకట్టా తెరకెక్కించారు. ఈ సినిమా సీక్వెల్ చేసేందుకు తగ్గ స్టోరీ రెడీ చేస్తున్నట్టుగా ఆ మధ్య దేవకట్టా కూడా చెప్పారు. అయితే.. దీని గురించి ఇంత వరకు అప్ డేట్ లేదు. తాజాగా కిరణ్‌ అబ్బవరంతో ‘క’ అనే సినిమాని తెరకెక్కించిన దర్శక ద్వయం సుజిత్-సందీప్.. తేజ్ కు కథ చెప్పారట.

డిఫరెంట్ గా ఉన్న ఈ కథకు తేజ్ ఒకే చెప్పారని తెలిసింది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి తేజ్.. కొత్త తరహా కథలతో సినిమాలు చేయాలి అనుకుంటున్నారు. మరి.. సంబరాల ఏటిగట్టుతో బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ పూర్తి స్థాయిలో ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

అప్పట్లో తేజ్ కెరీర్ స్టార్టింగ్ లోనే.. పిల్లా నువ్వు లేని జీవితం, రేయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్.. ఇలా వరుసగా సక్సెస్ సాధించి యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే.. మెగాస్టార్, పవర్ స్టార్ లకు తగ్గ మేనల్లుడు అని అభిమానులచేత అనిపించుకున్నాడు. అయితే.. వరుసగా విజయాలు సాధించి, అభిమానులను అలరించిన తేజ్.. ఆ తర్వాత చిత్రాలకు మాత్రం సరైన కథలు ఎంచుకోవడంలో తడబడ్డాడు. తిక్క, విన్నర్, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు అంటూ చేసిన ప్రయత్నాలు సరైన ఫలితాలు అందివ్వలేదు. దీంతో కెరీర్ లో వెనకబడ్డాడు. అభిమానులను నిరాశపర్చాడు.

తేజ్ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో చాలా కథలు విని ‘చిత్రలహరి’ అనే సినిమా చేశాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందిన చిత్రలహరి సినిమా, తేజ్ కు మంచి విజయాన్ని అందించింది. ఇక ఆతర్వాత సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, విరూపాక్ష, బ్రో సినిమాలు సక్సెస్ అందించాయి. అయితే.. రిపబ్లిక్ సినిమా టైమ్ లో బైక్ యాక్సిడెంట్ అయి, కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.. అయితే.. విరూపాక్ష, బ్రో చిత్రాలతో సూపర్ హిట్ సాధించినా స్పీడు పెంచలేదు తేఝ్. కాస్త విరామం ఇచ్చినా, సరైన కథతో సినిమా చేయాలని చాన్నాళ్లు వెయిట్ చేశాడు. ఆఖరికి నూతన దర్శకుడు రోహిత్ చెప్పిన సంబరాల ఏటిగట్టు అనే కథ నచ్చడంతో ఓకే చెప్పాడు.మరి.. సంబరాల ఏటిగట్టుతో బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ పూర్తి స్థాయిలో ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

Click Here To Read More

Click Here To Read డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న దేవరకొండ..

Leave a Reply