లంచాల వీఆర్వో పట్టివేత

  • రూ.40వేల సొమ్ముతో అరెస్టు

కర్నూలు బ్యూరో ఆంధ్రప్రభ : రూ.40,000 లంచం తీసుకుంటున్న దేవనకొండ మండలం నల్లచెలిమల వీఆర్వో అశోక్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చందోలి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ శివకుమార్, తన తల్లి పేరుమీద ఉన్న వారసత్వ భూమిని తన పేరుకి మార్చించాలని వీఆర్వోను సంప్రదించాడు. వీఆర్వో అశోక్ కుమార్ మొత్తం రూ.40,000 డిమాండు చేశాడు. ఇంత ఇవ్వలేను అని శివకుమార్ బ్రతిమిలాడినా,రూ.40 వేలు తప్పదు… అంతకంటే తక్కువ కాదు.. అని వీఆర్వో గట్టి తెగేసి చెప్పాడు. చివరికి శివకుమార్ ఏసీబీ ఆశ్రయించాడు.

కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో అధికారులు పన్నిన ప్రణాళిక ప్రకారం, సోమవారం మొత్తం ఆపరేషన్ జరిగింది. నాలుగు స్తంభాల మండపం వద్ద ఉన్న మౌరిన్ నెట్ సెంటర్ షాపులో డబ్బు అందుకుంటున్న వీఆర్వో అశోక్ కుమార్, మధ్యవర్తి జయరామును ఏసీబీ బృందం ప్రత్యక్షంగా పట్టుకుంది.

Leave a Reply