- కంచికచర్లలో ప్రత్యక్షం
కంచికచర్ల, ఆంధ్రప్రభ : అటవీ ప్రాంతాల్లోని అలుగు కంచికచర్ల పట్టణంలో సంచరిస్తుండటంతో పలువురు వీడియోలు తీసి షేర్ చేశారు. శరీరం అంతా ముళ్ళతో కూడిన ఈ జీవిని అలుగుగా, మరికొందరు ముళ్లపందిగా భావిస్తున్నారు. కంచికచర్ల సమీపంలో ఎటువంటి అటవీ ప్రాంతం లేకపోయినా ఎటు నుంచి వచ్చిందో ఈజీవి ఎవరికీ అర్థం కావట్లేదు.
ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రాంతంలో కంచికచర్ల పెద్ద బజారు పోస్ట్ ఆఫీస్ సమీపంలో గోడౌన్గా వాడుతున్న ఒక ఇంటి వద్ద ఈ జీవి సంచరిస్తుండటంతో అటుగా వెళుతున్న వారు గమనించి ఆసక్తిగా వీడియోలు తీశారు.
జీవి శరీరమంతా ముళ్ళుగా ఉండటంతో ఎవరు పట్టుకునేందుకు సాహసించలేదు. చూస్తుండగానే ఆజీవి చీకట్లోకి వెళ్లిపోయింది. కంచికచర్ల మండలం గొట్టుముక్కల అటవీ ప్రాంతం నుంచి ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ఈ జీవి ఈప్రాంతానికి కొట్టుకు వచ్చి, ఆ ప్రాంతంలో ఎక్కడ ఆవాసం చేసుకుని ఉంటున్నట్లు భావిస్తున్నారు.

