విజయవాడలో మెగా పాస్‌పోర్ట్ మేళా

ఆంధ్రప్రభ, విజయవాడ : త్వరలో నిర్వహిస్తున్న మెగా పాస్‌పోర్ట్ మేళను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. పాస్ పోర్టు మేళాలో పాల్గొనే అభ్యర్థులు ముందుగా తమ పేర్లను 7013727229 నంబరులో నమోదు చేసుకోవాలి. ఈ లింక్ ను https://www.passportindia.gov.in/psp క్లిక్ చేసి వెబ్ పేజీని తెరవాలి.

అందులో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం మీ పాస్ పోర్టు దరఖాస్తును పూర్తి చేయాలి. దరఖాస్తు పూర్తి చేసే క్రమంలో గతంలో పాస్‌పోర్ట్ తీసుకుని ఉంటే తప్పనిసరిగా దానిని మెన్షన్ చేయాలి. అది పోయినా, లేకుంటే రెన్యువల్ తేదీ దాటిపోయినా ఇబ్బందేమీ లేదు.

1) 18 సంవత్సరాలు దాటిన వారు కొత్తది లేదా రీ ఇష్యూ కనుక అయితే రూ.1,500 చెల్లించాలి.
2) 18 ఏళ్ల లోపు అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.

దరఖాస్తు పూర్తి చేసిన తరువాత ఫీజు చెల్లించాలి. ఆ తరువాత ఇంటర్వూ తేదీని ఎంపిక చేసుకోవాలి. కేటాయించిన తేదీల స్లాట్లు ప్రత్యేకంగా విడుదల అవుతాయి. పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు పాస్ పోర్టు అధికారులు ఫోన్ చేసి సమాచారం ఇస్తారు.

అప్పుడు తేదీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఈలోగా ఎలాంటి సందేహం ఉన్న ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకూ తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 8.30 గంటలలోపు మాత్రమే కాల్ చేయవచ్చు. కాల్ చేయవలసిన నంబరు 7013727229.

Leave a Reply