- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ, విజయవాడ : ఈ నెల 2వ తేదీ మంగళవారం మైలవరం నియోజకవర్గస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుందని, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక శాసనసభ్యులు కూడా హాజరయ్యే ఈ కార్యక్రమం మైలవరంలోని ఎస్‌వీ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలకు చేరువలోనే సుపరిపాలన అందించడంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలోనూ పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

