STUDENTS | వ్యసనాలకు దూరంగా ఉండాలి

STUDENTS | వ్యసనాలకు దూరంగా ఉండాలి
డీఐఈఓ అంజయ్య
STUDENTS | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు (Students)వ్యసనాలకు దూరంగా ఉండి.. చక్కగా చదువుకోవాలని జిల్లా డీఐఈఓ అంజయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాలను ఇవాళ సాయంత్రం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… తప్పకుండా 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు దురలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని పాడు చేసుకోకూడదని ఆయన సూచించారు. కళాశాల పనితీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రిన్సిపాల్ ఎదులాపురం లచ్చన్నను ఆయన అభినందించారు.
